- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి
దిశ, చైతన్య పురి : క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన యానాల గంగాధర్ రెడ్డి (52) మన్సూరాబాద్ డివిజన్ లోని హిమపురి కాలనీలో నివాసం ఉంటు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గత మూడు నెలలుగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గత 10 రోజులుగా బాలానగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 22 న రాత్రి మన్సూరాబాద్‌లోని సాయిబాబా ఆలయానికి వెళ్లి అతను అస్వాల్ మోనోస్టార్ (మోనోక్రోటోఫాస్) 36% ఎస్ ఎల్ ను సేవించాడు. మరుసటి రోజు ఉదయం అటుగా వచ్చిన సమీప బంధువు రాకేష్ రెడ్డి గమనించి కుమారుడు హేమంత్ రెడ్డికి సమాచారం అందించారు. అప్పటికే మృతిచెందినట్లుగా భావించారు. ఈ మేరకు కుమారుడు హేమంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.