- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి..
by Sumithra |

X
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : ప్రమాదవశాత్తు బావిలో పడి ఈతరాక వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జీడి వీరయ్య (35) అదే గ్రామానికి చెందిన అతని బంధువులు చనిపోవడంతో స్నానాలకు వెళ్ళాడు. పొలం వద్ద గల బావిలో పడి ఈతరాక మృతి చెందినట్లు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Next Story