- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి కార్మికుడు మృతి..
by Sumithra |
X
దిశ, నస్పూర్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటనలో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. జైపూర్ ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్ పోచమ్మ బస్తీకి చెందిన మోరే రమేష్ (32) ఆర్కే-7 గనిలో బదిలీ వర్కర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల అతనికి గోదావరిఖనికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది.
ఈ నెల 22న వివాహం జరగాల్సి ఉండగా వెడ్డింగ్ ఫోటో షూట్ గురించి మాట్లాడేందుకు గోదావరిఖనికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి మోరే రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story