వివాహం కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:2025-01-11 15:52:42.0  )
వివాహం కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, శంకరపట్నం : వివాహం కావడంలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.... సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన పేరాల శ్రీకాంత్ రావు అనే వ్యక్తికి వివాహ సంబంధాలు కుదరకపోవడంతో ఇక వివాహం కాదని మనస్థాపానికి గురై కొత్తగట్టు గుట్ట పై పురుగుల మందు తాగాడు. అనంతరం తండ్రికి ఫోన్​ ద్వారా సమాచారాన్ని అందించాడు. దీంతో తండ్రి హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు మృతుని తండ్రి తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.


Advertisement
Next Story

Most Viewed