- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సెల్ఫీ వీడియో తీసుకొని వ్యక్తి ఆత్మహత్య....

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : కేసముద్రం మండలం వెంక్యా తండాకు చెందిన బానోత్ అశోక్ (24) అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది తన మృతికి భార్య, అత్త, మామతో పాటు మరో ఇద్దరు బంధువులు కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తిరుపతి బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కేసముద్రం మండలం వెంక్య తండాకు చెందిన బాణోత్ అశోక్ ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మృతుని భార్య ప్రసవానికి పుట్టింటికి వెల్లిన తనభార్య తిరిగి కాపురానికి రావడం లేదని, కుమారుడిని కూడా చూపించడం లేదని తీవ్రమనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై అత్తింటివారి వేధింపులు, హేళనలతో తన కుమారుడు మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.