డీజే ఆపరేటర్ పై కత్తితో దాడి

by Sridhar Babu |
డీజే ఆపరేటర్ పై కత్తితో దాడి
X

దిశ, ఎల్కతుర్తి : డీజే ఆపరేటర్ పై కత్తితో దాడి జరిగిన సంఘటన మండలంలోని బావుపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బావుపేట గ్రామానికి చెందిన ఈరెల్లి మధు డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలోని వివాహ వేడుక శుక్రవారం ఎర్రగట్టు గుట్ట దేవస్థానంలో జరిగింది. సాయంత్రం బావుపేటలో భరాత్ నిర్వహించేందుకు అదే గ్రామానికి చెందిన పున్నం అనిరుద్ సిద్దు పరుష పదాలతో ఆపరేటర్ను బెదిరించి కత్తితో దాడి చేశాడు. దీంతో మధుకు దవడ పై బలమైన గాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed