ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన వ్యక్తికి జైలు

by Sridhar Babu |
ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన వ్యక్తికి జైలు
X

దిశ,పెగడపల్లి : ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ జడ్జి నీలిమ తీర్పునిచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన ఎదుల ప్రభాకర్ అలియాస్ ప్రవీణ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించగా నిందితుడిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కోర్టులో నిందితుడి నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా రెండు వేల రూపాయల జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన ఎస్సై రవి కిరణ్, కోర్టు కానిస్టేబుల్ కిరణ్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story