భార్య అలా చేసిందని భర్త ఆత్మహత్య..

by Sumithra |
భార్య అలా చేసిందని భర్త ఆత్మహత్య..
X

దిశ, నవాబుపేట : భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన మాచనమోని స్వాతికి గతంలో వివాహం జరగగా ఆమెకు ఒకకొడుకు పుట్టాడు. మొదటి భర్త చనిపోవడంతో నారాయణపేట జిల్లా బొమ్మన్ పహాడ్ గ్రామానికి చెందిన మల్లేష్ (25) ఆమెను వివాహం చేసుకుని భార్య పుట్టింటి గ్రామమైన యన్మన్ గండ్లలోనే భార్య స్వాతితోపాటు ఆమె కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు.

ఇటీవల భార్యను తనతోపాటు తమ ఊరికి రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్థాపాని గురైన మల్లేష్ గ్రామం సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాఆస్పత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed