- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీగా గుడుంబా స్వాధీనం
by Sridhar Babu |

X
దిశ, నల్లబెల్లి : ప్రభుత్వం నిషేధించిన నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నర్సంపేట ఎక్సైజ్ సిబ్బంది, వరంగల్ అర్బన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి నాటుసారా అమ్మకాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని మూడు విజయ, బోళ్ల సమ్మక్క, గొర్రె సాంబ లక్ష్మిలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నల్లబెల్లి తహసీల్దార్ ముప్ప కృష్ణ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నాటు సారా తిరిగి అమ్మితే జైలు శిక్ష విధిస్తామన్నారు. ఈ దాడులలో నర్సంపేట ఎక్సైజ్ నరేష్ రెడ్డి, వరంగల్ అర్బన్ టాస్క్ ఫోర్స్ ఎస్సై రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story