లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకుని.. విద్యార్థినిపై దారుణం

by Anjali |   ( Updated:2023-05-12 05:50:41.0  )
లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకుని.. విద్యార్థినిపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో జరిగే ఆత్యాచారాల ఘటనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు దుండగుల చేతిలో బలవుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా త్రిపురలో చోటుచేసుకుంది. కళాశాల నుంచి ఇంటికి వచ్చే క్రమంలో 20 ఏళ్ల ఓ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. ముగ్గురు యువకులు ఆ విద్యార్థినిపై అత్యాచారం చేశారు.

తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి పారిపోయారు. ఎవరో వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం తెలుపగా.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి, అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. సీసీటీవీ ఫుజేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఒకరి ఇంట్లో సోదాలు చేయగా, బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. వారి ఇంట్లో 90 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: HYD: కత్తితో పొడిచి భార్యను భవనం మీదనుంచి పడేసిన భర్త

Advertisement

Next Story