చంపుతా...చంపుతా...అన్నాడు...అంతపని చేశాడు...

by Sridhar Babu |   ( Updated:2025-02-16 14:17:33.0  )
చంపుతా...చంపుతా...అన్నాడు...అంతపని చేశాడు...
X

దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని గోదావరిరోడ్డు కొత్త ప్లాట్స్ లో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య లకావత్ రాజకుమారి (40) అనే మహిళను ఆమె భర్త గణేష్ సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి హత్య చేశాడు. నిందితుడు రోజు మద్యం తాగి భార్యకు ఇతరులతో అక్రమ సంబంధం ఉందని కొడుతూ, తిడుతూ, చంపుతానని బెదిరించేవాడు. అదే క్రమంలో నిన్న రాత్రి భార్యతో గొడవప పడ్డాడు. తన భార్య ఉదయం 3.30 గంటలకు బాత్రూమ్ కు వెళ్లగా వెనకాలే వెళ్లి బాత్రూంలో సిమెంట్ ఇటుక బండరాయితో తలపై కొట్టి చంపారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి భుఖ్య రేణుకాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్ తెలిపారు.

Next Story

Most Viewed