- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి బ్యాచ్ హల్చల్.. భయాందోళనలో స్థానికులు..
దిశ, ఉప్పల్ : గంజాయి బ్యాచ్ ఒక వ్యక్తి పై దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి రామంతాపూర్ లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో బాలనరసింహ అనే వ్యక్తి ఇంటి ముందు తన ఆటోను పార్కు చేసుకున్నాడు. ఆ ఆటోలో ముగ్గురు వ్యక్తులు కూర్చొని గంజాయి సేవిస్తున్నారు. తన ఆటోలో కూర్చొని ఏం చేస్తున్నారు అని ప్రశ్నించిన బాల నరసింహని గంజాయి బ్యాచ్ బెదిరిస్తుండగా తన కుమారుడు భరత్ (30) ఎదుకు పడ్డాడు.
దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు మరి కొంతమంది స్నేహితులను పిలిపించి భరత్ వాళ్ళ ఇంట్లోకి తలుపులు పగలగొట్టి దూరి భరత్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. స్థానికులు రావడం చూసి గంజాయి బ్యాచ్ పరారయ్యారు. భరత్ తల పై బలమైన గాయాలు కావడంతో స్థానికులు దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీ పరిసర కాలనీలలో కూడా ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఈ గంజాయి బ్యాచ్ వల్ల తమ కాలనీలకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కల్పించాలని స్థానికులు కోరారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.