కదులుతున్న బస్సులో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్..

by Manoj |
కదులుతున్న బస్సులో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వెలుగు చూస్తున్నాయి. కామంతో రగిలిపోతున్న కొందరు కీచకులు చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం బీహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో కదులుతున్న బస్సులో 17 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేశారు. మోతిహరి బస్టాండ్‌లో 17 ఏళ్ల బాలిక తన సొంతూరుకు వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తుంది. చంపారన్ ప్రాంతానికి వెళ్తున్నట్టు ఓ బస్సు డ్రైవర్ చెప్పడంతో అమ్మాయి బస్సు ఎక్కింది. కాసేపటి తర్వాత మాటలు కలిపి కండక్టర్ బాలికకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వడంతో అది తాగిన ఆమె సృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై డ్రైవర్, కండక్టర్,హెల్పర్ మరొక వ్యక్తి అత్యాచారం చేశారు. అది గమనించిన కొందరు స్థానికులు బస్సును ఆపి డోర్లు తీసి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed