- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయ వేడుకలో తీవ్ర విషాదం.. నలుగురు దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని అరక్కోణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో ఆదివారం రాత్రి క్రేన్ కూలి నలుగురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో పదిమంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి 1500 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. నెమిలి నుంచి దాదాపు 50 మంది పోలీసులను కూడా మోహరించారు.
Advertisement
Next Story