ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు కూలీలు మృతి

by Mahesh |
ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు కూలీలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వట్టిచెరుకూరులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో దాదాపు ఐదుగురు కూలీలు మృతి చెందారు. అలాగే మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో దాదాపు 40 మంది ఉన్నారని స్థానికులు తెలుపుతున్నారు. అలాగే గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story