- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రాణం తీసిన కుటుంబ గొడవలు
by Sridhar Babu |

X
దిశ, ఎల్లారెడ్దిపేట : ఓ హమాలీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోనేటి మల్లయ్య (52 ) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భార్య అంజవ్వతో గొడవ పడగా కొడిమ్యాల మండలం చెప్యాలలో గల తల్లిగారింటికి వెళ్లిపోయింది. దాంతో మృతుడు జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో శుక్రవారం దూలానికి ఉరి వేసుకున్నాడు. శనివారం దుర్వాసన వెదజల్లడంతో పక్కనున్న వాళ్లు తలుపులు తెరిచి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి కొడుకు రాజకుమార్, కూతురు శైలజ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story