నకిలీ కరెన్సీ..ఖమ్మంలో తయారీ హైదరాబాద్‌లో చలామణికి యత్నం..

by Aamani |
నకిలీ కరెన్సీ..ఖమ్మంలో తయారీ హైదరాబాద్‌లో చలామణికి యత్నం..
X

దిశ, సిటీ క్రైమ్ : రూ.14 వేల ఒరిజినల్ కరెన్సీ ఇస్తే లక్ష ఫేక్ కరెన్సీ ఇస్తానంటూ హైదరాబాద్ లో మకాం వేసిన పాత నేరస్థుడిని శనివారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన పి.మురళీ క్రిష్ణ చాలా వ్యాపారాలు చేశాడు. ఏ వ్యాపారంలో సక్సెస్ కాలేదు. ఆర్థిక నష్టాలు అధికమవడంతో ఫేక్ కరెన్సీ తయారీ కి శ్రీకారం చుట్టాడు. దీని కోసం గుంటూరు నుంచి ఖమ్మం ప్రాంతానికి మకాం మార్చిన మురళీ కృష్ణ ఫోటో షాప్ తో పాటు ఇతర కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో లెడ్జర్ పేపర్ తో రూ.500 కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నాడు. ఒరిజినల్ నోటు ను తలపించేలా గాంధీ ఫోటో తో పాటు వివిధ వాటర్ మార్క్ లోగోలను సైతం తయారు చేస్తున్నాడు. నోటు పై ఉండే గ్రీన్ కలర్ థ్రెడ్ ను పేపర్ ను వేడి చేసి అతికిస్తున్నాడు.

ఇలా తయారు చేసిన నకిలీ కరెన్సీని తయారు చేసి రూ.14 వేల అసలు నోటుకు లక్ష నకిలీ ఇస్తామని ప్రచారం చేసుకునేందుకు శనివారం హైదరాబాద్ బజార్ ఘాట్ గణేష్ టిఫిన్ సెంటర్ వద్ద కు మురళీ క్రిష్ణ వచ్చాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మురళీ క్రిష్ణ ను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ కరెన్సీని అతనే తయారు చేసినట్లు తెలిపాడు. గతంలో కూడా ఇలా నకిలీ కరెన్సీ తయారు చేసిన సంఘటనల్లో 3 కేసులు నమోదైనట్లు వివరించాడు. మురళీ క్రిష్ణ నుంచి 11.10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed