- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా చావుకు కారణం అదే.. వృద్ద దంపతుల సూసైడ్ నోట్..
దిశ, ఉప్పల్ : వృద్ధ దంపతులు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే ఉప్పల్ సాయిరాం నగర్ కాలనీలో దుర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి (60), భార్య జగదీశ్వరి (56)లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యనారాయణ శాస్త్రి రిటైర్డ్ ఎన్టీపీసీ ఉద్యోగి. వారం రోజుల క్రితం డిల్లీకి వెళ్తున్నట్లు కుమారునికి చెప్పినట్టు సమాచారం. మృతులు సుమారు ఐదు, ఆరు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
వృద్ధుల ఇంట్లో పనిచేసే పనిమనిషి ఊరికి వెళ్లి బుధవారం ఉదయం పని చేయడానికి వృద్ధుల ఇంటికి వచ్చేసరికి తలుపులు లోపటి నుంచి లాక్ ఉండటం, దుర్వాసన రావడంతో పనిమనిషి స్థానికులకు చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలువు పగలగొట్టి చూసేసరికి మృతుల బాడీ డీ కంపోస్ స్థితికి చేరాయి. వృద్ధ దంపతులు అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు, తమ చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు ఎస్సై మాధవ రెడ్డి తెలిపారు. వృద్ధుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మాధవ రెడ్డి తెలిపారు. వీరి కుమారుడు సుశాంత్ ఐటీ ఉద్యోగం చేస్తూ గచ్చిబౌలిలో ఉంటున్నాడు.