అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

by Sridhar Babu |
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
X

దిశ,ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సిరిసిల్ల డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి శనివారం విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి పేటకు చెందిన కోనేటి శివ రామ కృష్ణ, గోసికే గణేష్ ఇరువురూ మంచి స్నేహితులు. గత రెండు రోజుల క్రితం వీరు ఇద్దరూ గొడవ పడ్డారు. మాటమాట పెరగడంతో శివరామకృష్ణ ను గణేష్ కులం పేరుతో దూషిస్తూ కొట్టడంతో గాయాలయ్యాయి.

జరిగిన సంఘటనపై శివరామ కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన స్థానిక ఎస్ఐ నేరెళ్ల రమాకాంత్ కేసు నమోదు చేశారు.ఈ సంఘటనపై శనివారం సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి దాడి జరుగుతున్న సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు మహమ్మద్ దర్వేష్, ప్యాటమీది సురేష్ రెడ్డి తో పాటు మరో మహిళను విచారించారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వెంట ఎల్లారెడ్డి పేట సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ నేరెళ్ల రమాకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story