ఏసీబీ వలలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

by Sridhar Babu |
ఏసీబీ వలలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మంగళవారం విద్య అండ్ సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడి నిర్వహించగా బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ విద్య అండ్ సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆదిలాబాద్‌లోని విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) నిర్మాణ స్థలంలో 50 వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ.2 కోట్ల బిల్లుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed