ఏసీబీకి చిక్కిన దెందులూరు ఎలక్ట్రికల్ ఏఈ

by Javid Pasha |
ఏసీబీకి చిక్కిన దెందులూరు ఎలక్ట్రికల్ ఏఈ
X

దిశ, ఏలూరు: దెందులూరు ఎలక్ట్రికల్ ఏఈ అవినీతి అవతారం ఎత్తాడు. మండలంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులకు చెందిన బిల్లులు పాస్ అవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. రోజులు తరబడి తిరిగిన కాంట్రాక్టర్ విసుగు చెంది అవినీతి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం దెందులూరు మండలం ఎలక్ట్రికల్ ఏఈ సెక్షన్ లో అవినీతి అధికారులుకు పట్టుబడిన మల్లులు రమేష్ బాబు అనే అతనికి రూ.50 వేల రూపాయలు లంచం ఇస్తున్న సమయంలో ముందుగా అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ నెంబర్ 14400 కి ఫిర్యాదు చేసిన వ్యక్తి టి.శ్రీనివాసరావు వివరాల ప్రకారం లంచం తీసుకున్న వ్యక్తి మీద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏసీబీ డీఎస్పి టీ ఎస్ ఆర్ కే ప్రసాద్, సీఐలు శ్రీనివాసు, ఏసుబాబు, నాగేంద్రప్రసాద్, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed