పెండింగ్​ లో ఉన్న కేసుల్లో ఛార్జీషీట్ల దాఖలు

by Javid Pasha |
పెండింగ్​ లో ఉన్న కేసుల్లో ఛార్జీషీట్ల దాఖలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సుధీర్ఘ కాలంగా విచారణలో ఉన్న కేసుల్లో సీఐడీ వరంగల్​ రీజనల్ ​అధికారులు ఆయా కోర్టుల్లో ఛార్జీషీట్లు దాఖలు చేశారు. 2010లో ది క్రీసెంట్​ ఓవర్​ది వరల్డ్​ ఈజ్​ది బూన్​ ఆర్​ది సైలెంట్​హోలోకాస్ట్​ అన్న పేరున ఓ పుస్తకం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంట్లో పవిత్ర ఖురాన్, ప్రాఫెట్​ మహ్మద్ పై అభ్యంతరకరంగా ప్రచురితమయ్యాయి. దాంతోపాటు సల్మాన్​ రష్డీ రచించిన సాటానిక్​వర్సెస్, తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ పుస్తకాల్లో నుంచి కొన్ని వ్యాసాలను తీసుకుని ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇస్లాం ఫాసిజం పేర పుస్తకంలోని 294 నుంచి 298వ పేజీ వరకు ప్రాఫెట్​ మహ్మద్ ను నియంత హిట్లర్​ తో పోలుస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రచురించారు.

దీనిపై మహ్మద్​హసన్​ అహమద్​ అనే వ్యక్తి ఫిర్యాదు ఇస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులను కోరాడు. ఈ క్రమంలో సీఐడీ వరంగల్​ రీజనల్ ​అధికారులు పుస్తకాన్ని ఎడిట్​ చేసిన ఎం.లక్ష్మయ్య ఎలియాస్​ క్రాంతికార్, ఎం.సుబ్బారావు, నరిశెట్టి, ఇన్నయ్య, ఉప్పలపాటి గోపాలకృష్ణ రాజు, డీ.వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కోర్టుకు ఛార్జీషీట్ మాత్రం దాఖలు కాలేదు. ఈ క్రమంలో సీఐడీ ఛీఫ్​ మహేశ్ భగవత్​ ఆదేశాల మేరకు సీఐడీ వరంగల్​ రీజనల్ ​అధికారులు విచారణ పూర్తి చేసి, ఆధారాలను సేకరించి సంబంధిత కోర్టులో తాజాగా ఛార్జీషీట్ చేశారు.

ఎంజీఎంలో జరిగిన ఛీటింగ్ పై..

ఇక వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఛీటింగ్ కేసులో కూడా సీఐడీ సీఐడీ వరంగల్​ రీజనల్ ​అధికారులు కోర్టుకు ఛార్జీషీట్​ సమర్పించారు. హనుమకొండలోని తులసీ ఏజన్సీస్ నుంచి ఎంజీఎం హాస్పిటల్​ కు ఆక్సిజన్, నైట్రిక్ ​ఆక్సయిజన్ సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే 2007 నుంచి 2013వ సంవత్సరం వరకు ఏజన్సీ నిర్వాహకులు ఒక్కో సిలిండర్​ కు 180 రూపాయలకు బదులు 380 రూపాయలను కోట్ చేసి దాదాపు నాలుగు కోట్ల రూపాయలను స్వాహా చేశారు.

ఈ మేరకు ఫిర్యాదు అందగా సీఐడీ అధికారులు ఏజన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్ రెడ్డితోపాటు ఎంజీఎం లో పనిచేసిన డాక్టర్​ సి.రఘురాం, డాక్టర్​ అశోక్​ కుమార్, డాక్టర్​ ఏఎన్ఆర్.లక్ష్మీ, డాక్టర్​ బాలభద్ర పార్థుని శ్యామ సుందరరావు, డాక్టర్​ తుంగతుర్తి సురేందర్, డాక్టర్​ ఎం.సత్యదేవ్, డాక్టర్​ సి.నరేంద్రకుమార్, డాక్టర్​ బెంజిమాన్ శామ్యూల్, డాక్టర్​ కొండూరు నాగేశ్వరరావు, ఆక్టర్​ ఉద్దాల లక్ష్మీరాజం, డాక్టర్ పారిపల్లి సాంబశివరావు, డాక్టర్ దుర్గంధం శేషాచారి నర్సింహన్, డాక్టర్​ వరికోటి విష్ణుమోహన్​లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా విచారణ పూర్తి చేసిన సీఐడీ అధికారులు ఆధారాలతో సహా కోర్టుకు ఛార్జీషీట్​ సమర్పించారు.

Advertisement

Next Story