- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైల్డ్ పోర్నోగ్రఫీ: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
దిశ,డైనమిక్ బ్యూరో: చైల్డ్ పోర్నోగ్రఫీ పై సీబీఐ రంగంలోకి దిగింది. శనివారం దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణతో సహా మొత్తం 20 రాష్ట్రాల్లో 56 చోట్ల ఆపరేషన్ మేఘచక్ర పేరుతో సోదాలు నిర్వహిస్తోంది. న్యూజిలాండ్‌లోని అధికారుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఇంటర్‌పోల్ యొక్క సింగపూర్ ప్రత్యేక విభాగం ఇన్‌పుట్‌లను అనుసరించి ఈ ఆపరేషన్ను అధికారులు నిర్వహిస్తున్నారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ సర్క్యులేషన్ మరియు షేరింగ్‌కి వ్యతిరేకంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో సోదాలను సీబీఐ నిర్వహించినట్లు తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్‌ను ఆన్ లైన్‌లో ప్రసారం చేస్తున్న వారిని గుర్తించేందుకు ఈ రెయిడ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. ఇంటర్‌పోల్ సింగపూర్ నుండి వచ్చిన ఇన్‌పుట్‌లు మరియు క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించి ఇంటర్నెట్‌లో మెటిరియల్‌ను సర్క్యులేట్ చేస్తున్న పెడ్లర్లకు వ్యతిరేకంగా గత సంవత్సరం ఆపరేషన్ కార్బన్ జరిగింది. ఈ సమయంలో లభించిన కీలక సమాచారంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ఇన్ పుట్స్ ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
న్యూజిలాండ్, సింగపూర్ నుండి కీలక సమాచారం:
ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లోనేషన్ (ఐసీఎస్ ఈ) ఇంటర్‌పోల్‌కు సీబీఐ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఇది అంతర్జాతీయ బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన డేటా బేస్‌ను కలిగి ఉంది. ఇందులో సభ్యత్వం కలిగిన దేశాల మధ్య పరిశోధనలకు పిల్లల లైంగిక వేధింపుల కేసులపై సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈ ఇంటర్ పోల్ లో భారత్‌తో సహా 64 దేశాలు కొనసాగుతున్నాయి. ఈ డేటాబేస్‌లో ఉన్న 2.3 మిలియన్ చిత్రాలు, వీడియోల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 10,752 మంది నేరస్థులను గుర్తించగలిగారు. తాజాగా భారత్‌కు న్యూజిలాండ్, సింగపూర్ నుంచి వచ్చిన కీలక సమాచారంతో సీబీఐ మరోసారి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది.