బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

by Sumithra |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..
X

దిశ, కామారెడ్డి రూరల్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల జాతీయ రహదారి ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త వాహనాన్ని వెనుక నుండి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం, వెనకాల వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ప్రమాదం జరిగిన అనంతరం ఎమ్మెల్యే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వాహన కాన్వాయ్ నిజామాబాద్ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేట్ కారు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటనా స్థలానికి కామారెడ్డి పట్టణ పోలీసులు చేరుకుని సమీక్షించారు. ఎమ్మేల్యే సూచన మేరకు మధ్యలోకి వచ్చిన కారును పోలీసులు వదిలేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story