మహిళలపై అకృత్యాలు.. జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు..

by Aamani |
మహిళలపై అకృత్యాలు.. జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు..
X

దిశ, ఆసిఫాబాద్ : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న.. నైతికత విషయంలో మాత్రం మనుషులు రోజుకు దిగజారిపోతున్నారని చెప్పుకోవచ్చు.. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళల లైంగిక వేధింపులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కామాంధులు మహిళలను చిదిమేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన వయసుతో సంబంధం లేకుండా తమ కామవాంఛ కోసం అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్నారు. బాలికల కుటుంబీకులు ఇంటి చుట్టూ పక్కల నివసించే వారు. స్కూళ్లలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులతో ఇలా ప్రతి చోట ఆడపిల్లలకు రక్షణ కరువైంది.

ఈ మధ్య కాలంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడిన కొందరు యువత సోషల్ మీడియా సహాయంతో చిన్నారులను టార్గెట్ చేసి.. లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చిన్నారులపై లైంగికదాడులను అరికట్టడానికి కేంద్రం ఫోక్స్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన బీఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత వీటికి పూర్తి భిన్నమైన శిక్షల నిబంధనలను కలిగి ఉంటుందని, ఘటనను బట్టి మరణ శిక్ష విధించే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్న మార్పు మాత్రం కానరావడం లేదు. పిల్లలకు చిన్న వయస్సు నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై తమ పిల్లలకు అవగాహన కల్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు..

ఫోటోలు చూపిస్తూ బాలికలపై లైంగిక వేధింపులు..

సెప్టెంబర్ 24న చింతల మానేపల్లి మండల పరిధిలోని డబ్బా గ్రామానికి చెందిన లంబోటి వెంకటేష్ అనే వ్యక్తి పాఠశాలకు వెళ్తున్న ఓ మైనర్ బాలిక ఫోటోలు తీసి,వాటిని చూపిస్తూ బాలికలను బెదిరిస్తూ, శారీరకంగా మానసికంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు బాలిక కుటుంబ సభ్యులు చెప్పగా అతని షాపు వద్ద వెళ్లి నిలదీయగా బాలిక తండ్రి పై రాడ్ తో దాడి చేశాడు. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా అతని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు..

రూ.500 నోటు చూపించి ప్రలోభపెట్టే యత్నం..

సెప్టెంబర్ 16న బెల్లంపల్లి పట్టణంలోని ఓ బస్తీలో వినాయక మండపం వద్ద జరిగిన అన్నదానం కార్యక్రమానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న బాలికకు వేల్పుల నవీన్. చిప్ప హరీష్ అనే ఇద్దరు యువకులు రూ.500 నోటు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించి, ప్రలోభపెట్టే యత్నం చేశారు. వారి లైంగిక వేధింపుల నుంచి తప్పించుకుని సదరు బాలిక వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

షాపుకు వెళ్లి వస్తున్న బాలికను..

జూన్ 15న వాంకిడి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల మైనర్ బాలిక తన తమ్ముడితో కలిసి షాప్ కి వెళ్లి వస్తున్న సమయంలో పవార్ నితిన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెపితే చంపేస్తానని బెదిరించాడు. నిలదీయడానికి వెళ్లిన సదరు బాలిక తల్లిదండ్రుల పై గొడ్డలితో దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అతని పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఆటో ఎక్కిన మహిళపై..

సెప్టెంబర్ 3న జైనూర్ కు చెందిన ఓ గిరిజన మహిళ కోహినూర్ గ్రామానికి వెళ్తున్నట్లు నమ్మించి ఆటో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్లు షేక్ మాక్దుం కొంత దూరం వెళ్లాక ఆమె పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం మన అందరికి తెలిసిందే..

బాలికకు మాయమాటలు చెప్పి..

తాజాగా సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్ మండల పరిధిలోని బూరుగూడ గ్రామానికి చెందిన బొమ్మేన సాగర్ అనే వ్యక్తి స్కూల్ వెళ్లి తిరిగి వస్తున్న ఓ మైనర్ బాలికను అడ్డగించి ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అతని పై సెక్షన్ 65(1) బీఎన్ఎస్ పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేవలం 30 రోజుల వ్యవధిలో 4 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed