గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shiva |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

తిమ్మాపూర్ : గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన తిమ్మాపూర్ మండల పరిధిలోని మహాత్మానగర్ లక్ష్మినరసింహ స్వామి ఆలయ సమీపంలో ఆదివరం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు మహాత్మానగర్ శివారులోని కట్ట సమీపంలో స్థానికులకు ఓ వ్యక్తి మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శీలం ప్రమోద్ రెడ్డి మృతదేహాన్ని కరీంనగర్ మార్చురికి తరలించారు. మృతుడు స్థానికంగా కూలి పని చేసుకుని జీవించే ఆంధ్ర ప్రాంత వ్యక్తి అయి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. వడదెబ్బ తగిలి మృతిచెంది ఉంటాడని పేర్కొన్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed