- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
by Shiva |

X
దిశ, కొహెడ : బైక్ ఢీకొని వృద్ధుడి ఓ మృతి చెందిన ఘటన కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొహెడ మండలం సముద్రాలకు చెందిన మౌటం వీరయ్య (65) సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే హుస్నాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వెళ్తున్న బోదాసు రవి అనే వ్యక్తి అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వీరయ్యను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రయాదంలో తీవ్రంగా గాయపడిన వీరయ్యను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Next Story