మద్యానికి బానిసైన ఇంటర్ విద్యార్థి.. చివరికి అలా చేశాడు..

by Sumithra |
మద్యానికి బానిసైన ఇంటర్ విద్యార్థి.. చివరికి అలా చేశాడు..
X

దిశ, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిధిలోని సత్యసాయి నగర్ కాలనీకి చెందిన రాథోడ్ శివ సాయి(16) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యేడాది కాలంగా ఈ విద్యార్థి మద్యానికి బానిసయ్యాడు. రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా, మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు మందలించారు.

మనస్థాపం చెందిన మృతుడు ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, శివ సాయి స్థానిక ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

Advertisement

Next Story