మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

by Sumithra |
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ భూదాన్ పోచంపల్లి : ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో మనస్తాపం చెంది విద్యార్ధి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఇంద్రియాల గ్రామంలో బుధవారం జరిగింది. కుటుంబసభ్యులు, ఎస్సై ఎం విక్రమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి మణిశంకర్ (17) రంగారెడ్డి జిల్లా ఉప్పల్ లోని ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మృతుడు ఇంటర్ ఫస్టియర్ లో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. బ్యాక్లాగ్ సబ్జెక్టులను పాస్ అయ్యేందుకు ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలు రాశాడు.

మృతుని తండ్రి సొంత ఊరిలో నూతన గృహ నిర్మాణం పనులను చేస్తున్నందున మంగళవారం మృతుడు నానమ్మ ఇంట్లో పడుకున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం మృతుని తండ్రి ఇంటికి వచ్చి బిగ్గరగా తలుపులు కొట్టాడు. ఎంత కొట్టినా డోర్లు తీయకపోయేసరికి కిటికీలోనుంచి చూడగా చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడబడి ఉన్నాడని తెలిపారు. ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో మళ్లీ ఫెయిల్ అవుతానేమోనని మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని, మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, పోస్టు మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం విక్రమ్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story