సారీ వేదాంష్.. నీకొసం నేనేమి చేయలేకపోతున్నా.. ఓ తండ్రి ఆవేదన

by Sumithra |
సారీ వేదాంష్.. నీకొసం నేనేమి చేయలేకపోతున్నా.. ఓ తండ్రి ఆవేదన
X

దిశ, కాప్రా : ఆన్ లైన్ గేమ్ లకు అలువాటు పడి ఆర్థికంగా నష్టపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహాత్య చేసుకున్న సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చొటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం డీఏఈ కాలనీలో నివాసముంటున్న వరదశివ (31) (ఎన్ఎఫ్సీ) అణు ఇందన సంస్థలో గత కొన్నేళ్లుగా వర్కు అసిస్టెంట్ గా పనిచేస్తూ డీ2/43 క్వాటర్సులో ఉంటున్నాడు. ఏపీ ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన శివకు భార్య ప్రభాత, ఎడాదిన్నర వయస్సు గల వేదాంష్ (కొడుకు) ఉన్నారు.

అయితే వరద శివ గత కొంతకాలంగా ఆన్ లైన్ గేమింగ్ కు భానిసై సుమారు రూ.12 లక్షలు పొగొట్టుకుని మనస్తాపానికి గురయ్యాడు. భార్య తన పుట్టింటికి వెళ్లడం, గేమింగ్ లో డబ్బులు పొగోట్టుకోవటంతో సూసైడ్ నోట్ పెట్టి ఫ్యానుకు ఊరివేసుకున్నారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు ఇంటి తలపులు తెరిచిచూడగా ఉరివేసుకుని కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed