వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ప్రమాదం..

by Aamani |
వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో ప్రమాదం..
X

దిశ, గండిపేట్ : అదుపు తప్పిన కారు డివైడర్ పక్కన హోర్డింగ్ పోల్ ని ఢీ కొట్టిన ఘటనలో ఓ డాక్టర్ మృతి చెందగా మరో డాక్టర్ తీవ్ర గాయాలకు గురయ్యారు. సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. బాచుపల్లి కి చెందిన వీ.జస్వంత్, ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్లో నివాసం ఉండే భూమిక హౌస్ సర్జ‌న్ గా ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. కాగా శంకరపల్లి లో ఓ వివాహ వేడుకకు వారు హాజరై శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. కాగా కారు (టిఎస్ 02 ఈ ఎక్స్ 5656) వాహనంలో వస్తున్నారు. ఖానాపూర్ సమీపంలోకి రాగానే కారు అద్భుతప్పి డివైడర్ పైన ఉన్న హోర్డింగ్ పోల్ ని ఢీ కొట్టింది. దీంతో డ్రైవర్ సీట్ లో ఉన్న జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భూమిక తీవ్ర గాయాలకు గురైంది. విషయాన్ని తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భూమిక అంబులెన్స్ లో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. జస్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed