ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. కారణమిదే!

by Javid Pasha |
ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. కారణమిదే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రియురాలిని పట్టపగలు అందరూ చూస్తుండగా ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గురుగ్రామ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన 19 ఏళ్ల యువతికి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లు గడిచాక ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. పెద్దలు వారిద్దరికి నిశ్చితార్థం కూడా చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే యువతిని వేధించడం మొదలుపెట్టాడు ఆ యువకుడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుండా చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. కానీ ఆ యువతి ఇవేమీ పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే ఫ్రెండ్ తో బయటకు వచ్చిన యువతిని అడ్డగించిన యువకుడు.. మాట్లాడుతానంటూ దగ్గరకు వచ్చి కత్తితో ఆమెపై దాడిగి దిగాడు. ఆమె కడుపులో, మెడపై కత్తితో ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఘటన జరగుతున్న సమయంలో అక్కడ చాలా మందే ఉన్నారు. అయితే అతడి చేతిలో కత్తిని చూసి వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా తనతో పెళ్లికి నిరాకరించినందుకే ఆమెను చంపేసినట్ల నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed