- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాలుగో అంతస్తు పై నుంచి పడి కార్మికుడు మృతి
దిశ, పేట్ బషీరాబాద్: రెండు నెలల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వచ్చాడు. ఓ నిర్మాణంగా సంస్థలు కార్మికుడిగా చేరి విధుల్లో ఉండగా మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐడిపిఎల్ లో స్టార్ లైట్ కన్స్ట్రక్షన్ వారు ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కలిమెళ్ళ గ్రామానికి చెందిన శంకర్ (42) ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితం వీరి వద్ద పనికి చేరాడు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నాలుగో అంతస్తులో పిల్లర్లు ఏర్పాటు పనిలో ఇతర కార్మికులతో కలిసి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శంకర్ అదుపుతప్పి నాలుగో అంతస్తు నుంచి కింద పడ్డాడు. కింద పడిన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆందోళన చేసిన కార్మిక సంఘాలు
కార్మికుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కార్మిక సహాయకులు నిర్మాణం జరుగుతున్న భవనం వద్ద ఆందోళన చేపట్టారు. కార్మికులు న్యాయం చేసేంతవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.