- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పిడుగు పడి మహిళ మృతి.. నలుగురికి గాయాలు
by Javid Pasha |

X
దిశ, డోన్ : డోన్ మండలంలోని చిన్న మల్కాపురం గ్రామంలో పిడుగు పడి లక్ష్మీ దేవి (34) అనే మహిళ మృతి చెందింది. పుణ్యవతి, అనిత, లక్ష్మీదేవి, ఖాసింబిలు అనే మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగుంట్ల గ్రామం నుండి వ్యవసాయ కూలి పనుల కోసం చిన్న మల్కాపురం గ్రామానికి వెళ్లి వస్తున్న సమయంలో సదరు మహిళలు పిడుగు పాటుకు గురి అయ్యారు. కాగా మృతురాలు లక్ష్మీదేవకి కుమార్తెలు రూప, వైష్ణవి ,కుమారుడు అభి ఉన్నారు. ఆరేళ్ల కిందట తండ్రి, తాజాగా తల్లి మరణించడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. మహిళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story