- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తినమని బిస్కెట్లు ఇస్తే పొట్టు పొట్టు కొట్టిన్రు
దిశ, వెబ్ డెస్క్: తినమని తోటి మిత్రులకు బిస్కెట్లు ఇస్తే పొట్టు పొట్టు కొట్టిన ఘటన మహారాష్ట్రలోని థానేలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాపూర్ సీనియర్ సీఐ రాజ్ కుమార్ ఉపాసీ తెలిపిన వివరాల ప్రకారం.. తాగుడుకి బానిసైన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (30)ను అతడి తల్లిదండ్రులు తాగుడే మానిపించడానికి థానేలోని ఓ రీహాబిలిటేషన్ సెంటర్ లో గతేడాది డిసెంబర్ లో జాయిన్ చేశారు. కాగా ఫిబ్రవరి 23న సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదే సెంటర్ లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి తినమని బిస్కెట్లు ఇచ్చాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన సిబ్బంది.. అక్కడ తోటివారికి బిస్కెట్లు ఇవ్వడం రూల్స్ కు విరుద్ధమంటూ చితకబాదారు.
తనను కొట్టినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడి ఒంటిపై గాయాలను చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగ్గా బాధితుడు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తల్లిదండ్రులు.. అనంతరం షాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.