- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అప్పుల బాధలు తాళలేక వ్యక్తి బలవన్మరణం

దిశ, జమ్మికుంట : అనారోగ్యానికి అప్పులు తోడవడంతో జీవితంపై విరక్తి కలిగి ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇల్లందకుంట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శనిగరపు శ్రీనివాస్ (46) తన ముగ్గురు చెల్లెళ్ల పెళ్లి నిమిత్తం రూ.4 లక్షల మేర అప్పు చేశాడు. అప్పుకు తోడుగా అతను కామెర్లు, కిడ్నీల సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు.
ఓ వైపు చేసిన అప్పులు, మరో పైపు ఆరోగ్యం సరిగా లేక జీవితంపై విరక్తి కలిగి గురువారం రాత్రి ఊరుబయటకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఇంట్లో వరుసగా వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అతను చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.