ఒంటరిగా కనిపిస్తే లిప్ లాక్ కిస్సులే.. రెచ్చిపోతున్న కామాంధులు (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-10 11:23:21.0  )
ఒంటరిగా కనిపిస్తే లిప్ లాక్ కిస్సులే.. రెచ్చిపోతున్న కామాంధులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : కామాంధులు కొత్త తరహలో తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మార్పింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్, ఇవ్ టీజింగ్, అత్యాచారాలకు పాల్పడిన కీచకులు తాజాగా మహిళలు, యువతులు ఎక్కడ ఒంటరిగా దొరికితే అక్కడే తన కోరిక తీర్చుకోని పరారీ అవుతున్నారు. దీంతో ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు అతివలు. ఇంతకూ వీళ్లు ఎలాంటి నీచపు పనులకు తెగపడుతున్నారంటే..

సీసీ కెమెరాలో రికార్డు అయిన దాని ప్రకారం ఓ మహిళ ఆస్పత్రి ఆవరణలో నిలబడి ఫోన్ మాట్లాడుతుంది. అదే సమయంలో హఠత్తుగా వచ్చిన ఓ యువకుడు ఆమెను గట్టిగా పట్టుకుని లిప్ లాక్ కిస్ ఇచ్చాడు. ఆ మహిళ అతడిని వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. పెదవులను వదలని యువకుడు కొద్దిసేపు అలాగే ముద్దు పెట్టి క్షణాల్లో పరారీ అయ్యాడు. ఈ ఘటన బిహార్‌లోని జమయిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఆకతాయిలు ఇలా ఒంటరిగా ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి అసభ్యంగా ప్రవర్తింస్తుండటంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తోడు లేకుండా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.

Advertisement

Next Story