కల్తీ కల్లు సేవించి కల్లు దుకాణంలోనే కుప్పకూలి వ్యక్తి మృతి..

by Kalyani |
కల్తీ కల్లు సేవించి కల్లు దుకాణంలోనే కుప్పకూలి వ్యక్తి మృతి..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: కల్తీ కల్లు సేవించి కల్లు దుకాణంలోనే కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామకృష్ణ టాకీస్ రోడ్డులోని కల్లు దుకాణంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన విష్ణుమూర్తి (55) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన కుమారుని అద్దె ఇంట్లోకి వచ్చి సమీపంలో ఉన్న కల్లు దుకాణంలో కల్లు సేవించాడు.

కొద్దిసేపటికి కుప్పకూలి పడిపోవడంతో కంగారుపడి కల్లు డిపో మూసి యాజమానులు పారిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు బారినపడి అమాయక ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్న సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story