- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూలి డబ్బు ఇవ్వలేదని చేయి కోసుకున్న కూలీ
by Shiva |

X
దిశ, నర్సాపూర్ : కూలి డబ్బు ఇవ్వలేదని ఓ కూలీ బ్లేడ్ తో చేయి కోసుకున్న ఘటన నర్సాపూర్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. పట్టణంలోని శివాలయం వీధికి చెందిన భాను అనే రోజు కూలీ వీరేశం అనే మేస్ర్తీ వద్ద గత కొన్ని రోజులుగా పని చేస్తున్నారు. అయితే, చేసిన పనికి మేస్ర్తీ వీరేశం భానుకు కూలి డబ్బు ఇవ్వకపోవడంతో విసుకు చెంది బుధవారం రాత్రి బ్లేడ్ తో తన చేయి కోసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో అతడిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Next Story