- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం

X
దిశ, సింగరాయకొండ : పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని నరసింహ నగర్ లో నివాసముంటున్న ఓ వృద్ధురాలు పూరిల్లు దగ్ధమైన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. విపరీతమైన గాలికి విద్యుత్ వైర్లు చెట్లకు తగులుకొని షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి పూరీళ్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ఇక బోరంగి దేవకి అనే వృద్ధురాలు అంధురాలు కావడంతో కుమారుడు ఆమెను కాపాడాడు. ఆమె కూమారుడు వీధుల వెంట చెత్త అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు.
వీరికి ఎటువంటి ఆధారం లేదని ప్రభుత్వం వారు సహాయం చేయాలని కోరుతున్నారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
Next Story