- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుర్తు తెలియని వాహనం ఢీకొని దివ్యాంగుడి దుర్మరణం

X
దిశ, దౌల్తాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని దివ్యాంగుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన పోతరాజు వెంకటేశం(34) రాత్రి ట్రై సైకిల్ పై రోడ్డు మార్గాన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు ఆడ పిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు.
Next Story