- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
దిశ, పటాన్చేరు : పటాన్చేరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహ విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా డీసీఎం వ్యాన్ ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే పఠాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన సంగన్న గారి రామచంద్రయ్య కూతురు వివాహం శుక్రవారం జరిగింది. కాగా శనివారం సాయంత్రం వివాహ విందు నిమిత్తం బంధువులతో డీసీఎం వ్యాన్ లో బయలుదేరి వెళ్లారు.
విందు ముగించుకుని తిరిగి తమ గ్రామానికి వస్తున్న తరుణంలో రుద్రారం గ్రామ సమీపంలోని ప్యాలెస్ హోటల్ వద్ద జాతీయ రహదారి పై ఆగివున్న లారీని డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంగన్న గారి కిష్టయ్య, ఏర్పుల రాములమ్మ మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ లో ప్రయాణిస్తున్న మరో 35 మందికి స్వల్ప గాయలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యుల సూచనల మేరకు 5 గురిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
క్షత గాత్రులను పరామర్శించిన నీలం మధు ముదిరాజ్..
వివాహ విందుకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి అర్చన హాస్పిటల్, పనేసియా, కాకతీయ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ పరామర్శించారు. గాయపడిన వారికి అండగా ఉంటూ సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకునేలా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.