- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం
దిశ, డైనమిక్ బ్యూరో : ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరినీ ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచారు. అయితే కరోనా మహమ్మారికి ఓ కుమార్తె బలైంది. దీంతో చిన్న కుమార్తెను మరింత అపురూపంగా పెంచారు. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టారు. కొడుకు లేని లోటు తీరుస్తాడనుకున్న అల్లుడు కఠినంగా మారాడు. కుమార్తెను, అత్తామామలను వేధింపులకు గురి చేయడం మెుదలు పెట్టాడు. దీంతో ఆ దంపతులు తీవ్రమనస్థాపానికి గురయ్యారు. అల్లుడి గొంతెమ్మ కోరికలు తీర్చలేక వేధింపులు భరించలేక కుమార్తెతో కలిసి రన్నింగ్ ట్రైన్ కింద పడి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ షాకింగ్ ఘటన కర్నూలు జిల్లా ఆదోని రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన పద్మనాభం, సెల్వి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
పెద్ద కుమార్తె కరోనాతో మరణించగా రెండో కుమార్తె జీవితకు ఇటీవలే పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటి నుంచి అల్లుడి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో తల్లిదండ్రులు భరించలేకపోయారు. అంతే మంగళవారం ఆదోని రైల్వేస్టేషన్ వద్ద రన్నింగ్ ట్రైన్ కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన రైల్వే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదంలో తండ్రి పద్మనాభం, భార్య సెల్వి, కుమార్తె జీవితకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. అల్లుడి వేధింపులు తాళలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితులు వాపోయారు.
Also Read..