- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మావోయిస్టుల మందుపాతర పేలి కానిస్టేబుల్‌కు గాయాలు
by Javid Pasha |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులను టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టం బీజాపూర్ జిల్లా నెల్సనార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రాష్ట్ర రహదారి అయిన పాండే మార్గ్ పక్కన మావోయిస్టులు మందుపాతర పెట్టారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం సీఆర్పీఎఫ్ బాంబ్డి స్పోజల్ స్క్కాడ్ అక్కడికి వెళ్లింది. బృందంలోని రవికుమార్ అనే కానిస్టేబుల్ మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబును నిర్వీర్యం చేస్తుండగా అది పేలిపోయింది. తీవ్రంగా గాయపడ్డ రవికుమార్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Next Story