స్కూలుకెళ్లిన చిన్నారి శవమై తిరిగొచ్చింది...

by Sridhar Babu |
స్కూలుకెళ్లిన చిన్నారి శవమై తిరిగొచ్చింది...
X

దిశ, గొల్లపల్లి : స్కూలుకెళ్లిన చిన్నారి శవమై తిరిగొచ్చింది. టాటా ఏస్ వాహనం నుంచి జారిపడి చిన్నారి మృతి చెందిన ఘటన గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పురాణం రవీందర్- లత దంపతుల కుమార్తె స్పందన (6) చిల్వకోడూరు ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది. అయితే ఎప్పటిలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన స్పందన సాయంత్రం టాటా ఏస్ వాహనంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో గోవిందుపల్లి బస్ స్టాండ్ వద్ద టాటా ఏస్ డోర్ కదలడంతో ప్రమాదవశాత్తు కింద పడింది.

దీంతో తీవ్రగాయాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. స్కూలుకు వెళ్లిన చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed