ఇద్దరు విలేకర్లపై కేసు నమోదు

by Sridhar Babu |
ఇద్దరు విలేకర్లపై కేసు నమోదు
X

దిశ, క్రైం : ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నారి విజయలక్ష్మి విధులకు ఆటంకం కలిగించిన విలేకరులపై కేసు నమోదు చేసినట్లు రఘునాథ పాలెం పోలీసుస్టేషన్ సీఐ మహ్మద్ ఉష్మాన్ షరీఫ్ తెలిపారు. సీఐ కథనం మేరకు ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ నారి విజయలక్ష్మి శనివారం ఉదయం ఐడీఓసీ ఆఫీసుల్లో విధులులను నిర్వహిస్తుండగా వెంకటేశ్వర్లు, అతనితో పాటు మరొక వ్యక్తి వచ్చి తాము పత్రికా విలేకరులమని చెప్పి తమ పత్రికకు రూ.10 వేల యాడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో వాగ్వాదానికి దిగి అసభ్యకరంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారు. దాంతో ఆమె ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రఘునాథపాలెం ఇన్స్‌పెక్టర్ మహ్మద్ ఉష్మాన్ షరీఫ్ తెలిపారు‌.

Advertisement

Next Story

Most Viewed