- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీసీ బస్సు ఢీకొని ఎద్దు మృతి
by Shiva |

X
దిశ,చిలిపిచెడ్ : అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఎద్దును ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిట్కుల్ గ్రామ శివారులో గంగిరెద్దుల ఎల్లయ్యకు చెందిన ఎద్దు రోడ్డు దాటుతుండగా బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఎల్లయ్య కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమైయ్యారు. ఎద్దు మృతి చెందడంతో తాము జీవనోపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story