- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరి మహిళపై దాడి కేసులో 14 మందికి జైలు
దిశ, ఆసిఫాబాద్ : కౌటల పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపేట్ గ్రామానికి చెందిన ఒక మహిళపై మారణాయుధాలతో దాడి చేసిన కేసులో 14 మందికి మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఆసిఫాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.యువరాజ్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కౌటాల మండలం ముత్యంపేట్ గ్రామానికి చెందిన గాది రెడ్డి నాగమణికి, కస్తూరి సత్యనారాయణకు ఓ భూమి విషయంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలంలో గాదిరెడ్డి నాగమణి ఇంటి నిర్మాణం చేపట్టారు.
05.02.2021లో కస్తూరి సత్యనారాయణ, కస్తూరి కృష్ణ చైతన్య, కస్తూరి వంశీకృష్ణ, పూల మధుకర్, సాయి తేజ, కస్తూరి దుర్గయ్య, కస్తూరి సంతోష్, ధోని శ్రీధర్, గోలేటి విశ్వనాథ్, లక్ష్మీ కళావతి, పద్మ, అంకుబాయి, నాగరాజు కలిసి పథకం ప్రకారం రావి శ్రీనివాస్ ప్రోద్భలంతో ఆమె పై దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదులో 14 మంది నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా నేరం రుజువు కావడంతో నిందితులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.