పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి..

by Kalyani |
పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి..
X

దిశ, గోపాలపేట: పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బుద్ధారం గ్రామంలో అర్ధరాత్రి ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో బీభత్సంగా వర్షం కురిసింది.

గ్రామానికి చెందిన గొర్రెల కాపరి తన సొంత పొలంలో కొట్టం వేసుకొని గొర్రెలను అక్కడే ఉంచాడు. రాత్రి వర్షంతో పాటు పిడుగు పడడంతో 13 గొర్రెలు మృతి చెందాయి. దీంతో 1,50,000 ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

Advertisement

Next Story