జోరుగా క్రికెట్ బెట్టింగ్..

by srinivas |   ( Updated:2020-10-10 08:34:16.0  )
జోరుగా క్రికెట్ బెట్టింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పుణ్యమా అని బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. చాలా చోట్ల గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఏలూరులోని రాజా లాడ్డిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్‌లో పాల్గొన్న 27 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.21,070 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story